Wings India : నేటి నుంచే ‘వింగ్స్ ఇండియా-2024’ ప్రదర్శన
X
అంతర్జాతీయ విమానాల ప్రదర్శనకు హైదరాబాద్ నగరం మరోసారి వేదిక కానుంది. ఈ క్రమంలోనే బేగంపేట్ విమానాశ్రయంలో 4 రోజుల పాటు వింగ్స్ ఇండియా పేరుతో ప్రదర్శన నిర్వహిస్తున్నారు. నేటి నుంచి 21 వరకు ‘వింగ్స్ ఇండియా’(Wings India Show 2024) ప్రదర్శన జరగనుంది. ఈ మేరకు ఇవాళ ఉదయం 10 గంటలకు కేంద్ర కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పారంభించనున్నారు. 4 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన విమానాలు వీక్షకులకు కనువిందు చేయనున్నాయి. ఈ ప్రదర్శనలో 130 ఎగ్జిబిట్‌లను ఉంచనున్నారు. దాదాపు 30 విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన టికెట్లు బుక్‌మై షోలో విక్రయిస్తున్నారు. కాగా, దేశంలో విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయడం నేపథ్యంలో ‘వింగ్స్ ఇండియా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి బేగంపేట్ ఎయిర్‌పోర్టు రెడీ అవుతున్నది. కాగా, ఈ ప్రదర్శనకు బేగంపేటకు బోయింగ్ 777-9 విమానం రానుంది.