Home > తెలంగాణ > Yadagirigutta : సీఎం కేసీఆర్ చొరవ.. యాదాద్రి ఆలయానికి విద్యుత్ ప్రత్యేక రాయితీ

Yadagirigutta : సీఎం కేసీఆర్ చొరవ.. యాదాద్రి ఆలయానికి విద్యుత్ ప్రత్యేక రాయితీ

Yadagirigutta : సీఎం కేసీఆర్ చొరవ.. యాదాద్రి ఆలయానికి విద్యుత్ ప్రత్యేక రాయితీ
X

యాదాద్రి ఆలయానికి రిలీజియన్ కేటగిరిలో విద్యుత్ ప్రత్యేక రాయితీ(Subcidy)ని తెలంగాణ ప్రభుత్వం అందించింది. యాదాద్రి ఆలయం విస్తరణ నేపథ్యంలో కరెంట్ బిల్లులు భారీగా పెరిగాయంటూ దేవస్థానం ఈవో గీత, విద్యుత్‌ విభాగం ఈఈ రామారావు ఆలయ పర్యటనకు వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ERC) ద్వారా దేవాలయానికి విద్యుత్ వినియోగంలో రాయితీని కల్పించారు. దీంతో ఆలయానికి నెలకు రూ.15లక్షల(Rs.15 lakhs)వరకు బిల్లుల భారం భారీగా తగ్గనున్నది.





ఈఆర్‌సీ రిలీజియన్‌ క్యాటగిరీ కింద రిటైల్‌ సరఫరా టారిఫ్‌, క్రాస్‌ సబ్సిడీ సర్‌చార్జ్‌ ప్రకటించడంతో స్వామివారి ఆలయానికి నెలకు రూ.15 లక్షల వరకు ఆదా కానుంది. ప్రతి నెలా రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు విద్యుత్తు బిల్లు వస్తున్నదని, ప్రస్తుతం ప్రకటించిన ప్రత్యేక రాయితీతో రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఆలయ ఈవో ఎన్‌ గీత గురువారం మీడియాకు వెల్లడించారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా దేవస్థానాన్ని విస్తరించడంతోపాటు విద్యుద్దీపాలంకరణ, సీసీ కెమెరాల ఏర్పాటు, క్యూకాంప్లెక్స్‌లలో ఏసీలు, కంప్యూటరైజ్డ్‌ బిల్లింగ్‌, లడ్డూ ప్రసాద తయారీలో విద్యుత్తు వినియోగం భారీగా పెరిగిందని చెప్పారు. రాయితీ ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు, సహకరించిన ఈఆర్‌ఎస్‌ రంగారావు, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావుకు ఈవో ఎన్‌ గీత, విద్యుత్తు విభాగం ఈఈ ఊడేపు రామారావు ధన్యవాదాలు తెలిపారు.




Updated : 8 Sep 2023 2:28 AM GMT
Tags:    
Next Story
Share it
Top