Bandi Sanjay : ప్రధానిగా మోదీ లేని దేశాన్ని ఊహించుకోవడం లేదు..బండి సంజయ్ కామెంట్స్
X
ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ ఎంపీగా గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తామని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీయే కాదన్నారు. తాను రాముడిని నమ్ముకుని ప్రజల్లోకి వెళ్లానని, ఓటర్లు తనకు ఓటేస్తే తాను మోదీకి ఓటేస్తానని చెప్పారు.ప్రధాని మోదీ లేని దేశాన్ని ఎవరు ఊహించుకోవడం లేదని అని సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితే ఎవ్వరి పేరు చెప్పడం లేదన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగుతోంది. కమలాపూర్ నుంచి ఈ యాత్రను ప్రారంభించారు.
తరువాత నియోజకవర్గంలోని ముఖ్యమైన ప్రాంతాల మీదుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు.. కరీంనగర్ పార్లమెంటు చేసిన అభివృద్ధి పనులను వరిస్తున్నారు బండి సంజయ్. ముఖ్యంగా స్థానిక నేతలు, కార్యకర్తలకు కూడా జోష్ నింపుతున్నారు. వారికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో 350కి పైగా సీట్లు గెలుస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 17కు 17 స్థానాలు కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజాహిత యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన కలుగుతుందన్నారు. ఈ నెల 4, 5వ తేదీన ప్రధాని మోదీ సభలో పాల్గొనేందుకు వెళ్తున్నానన్నారు. శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఈ నెల 8, 9వ తేదీల్లో ప్రజాహిత యాత్రకు విరామాన్ని ఇస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు.