Home > తెలంగాణ > హైదరాబాద్‌లో దారుణం.. తండ్రి గొంతు కోసి చంపిన కూతురు

హైదరాబాద్‌లో దారుణం.. తండ్రి గొంతు కోసి చంపిన కూతురు

హైదరాబాద్‌లో దారుణం.. తండ్రి గొంతు కోసి చంపిన కూతురు
X

హైదరాబాద్ నగరం అంబర్‌ పేట్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడే తండ్రిపైనే ఓ యువతి కిరాతకానికి ఒడిగట్టింది. వివరాల ప్రకారం.. అంబర్ పేట్‌లో కుటుంబంతో నివసిస్తోన్న జగదీష్.. శనివారం అర్ధరాత్రి కూతురు నిఖితను ఏదో విషయంలో మందలించాడు. దీంతో కోపం పెంచుకున్న నిఖిత.. తండ్రిపై దాడి చేసి గొంతు కోసింది. గమనించిన కుటుంబ సభ్యులు జగదీష్‌ను ఆసుపత్రిగా తరలించారు. చికిత్స పొందుతూ జగదీష్ ఆదివారం మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. నిఖితను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

అంబర్ పేటలోని తులసి రామ్ నగర్ లో శనివారం అర్దరాత్రి ఈ దారుణం జరిగింది. నగరంలోని అఫ్జల్ గంజ్‌లో ఓ దుకాణంలో పని చేస్తున్న నిఖిత.. ప్రతీరోజూ ఇంటికి లేట్ గా వచ్చేది. లేటుగా వస్తున్నావని తండ్రి జగదీశ్ పలుమార్లు హెచ్చరించాడు. తండ్రి మందలించాడని కోపంతో గాజు పెంకుతో అతని గొంతు కోసింది నిఖిత. తీవ్రంగా గాయపడ్డ తండ్రి జగదీశ్వర్ ను పోలీసుల సహాయంతో కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించి జగదీశ్ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. కూతురు నిఖితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




Updated : 30 July 2023 1:10 PM IST
Tags:    
Next Story
Share it
Top