అందం కోసం బ్యూటీ పార్లర్కు పోతే.. ఎంత పనైందంటే..?
X
భర్త ఆమెను ఓ మోడల్గా చూడాలనుకున్నాడు. దీంతో ఆమె మరింత అందంగా మారాలని నిశ్చయించుకుని బ్యూటీ పార్లర్కు వెళ్లింది. స్టైలిష్ హెయిర్ కట్ చేయాలని అక్కడి సిబ్బందికి చెప్పింది. సీన్ కట్ చేస్తే ఉన్న జుట్టు ఊడింది. దీంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హైదరాబాద్ అబిడ్స్లో జరిగింది.
అబిడ్స్ లోని ఓ ఫేమస్ బ్యూటీ పార్లర్కు ఓ మహిళ వెళ్లింది. తనకు జుట్టు పొడువుగా ఉందని.. దానిని కట్ చేసి స్టైలిష్గా చేయాలని సిబ్బందికి సూచించింది. ఆమె చెప్పినట్లుగానే చేసిన సిబ్బంది తలకు ఓ అయిల్ పెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె జుట్టు ఊడిపోవడం స్టార్ట్ అయ్యింది. దీంతో ఖంగుతిన్న మహిళ వెంటనే ఇంటికి వెళ్లింది. భార్య అవతారం చూసి భర్త కూడా షాక్ తిన్నాడు.
భార్యభర్తలు బ్యూటీ పార్లర్ వద్ద వెళ్లి నిర్వాహకులను నిలదీశారు. ఈ క్రమంలో భార్యభర్త మధ్య కూడా గొడవ జరిగింది. అనంతరం మహిళ ఊడిన జుట్టును తీసుకుని పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా బ్యూటీ పార్లర్స్ లో ఇటువంటి ఘటనలు ఎక్కువయ్యాయి. ఫేస్‌మాస్క్ వికటించి మొహం నల్లగా మారిపోవడం, ఫేస్ పై పొక్కులు రావడం ఘటనలు జరిగిన విషయం తెలిసిందే.