Home > తెలంగాణ > Sangareddy : ఆర్టీసీ బస్సులో పొట్టుపొట్టుగా కొట్టుకున్న మహిళలు

Sangareddy : ఆర్టీసీ బస్సులో పొట్టుపొట్టుగా కొట్టుకున్న మహిళలు

Sangareddy : ఆర్టీసీ బస్సులో పొట్టుపొట్టుగా కొట్టుకున్న మహిళలు
X

తెలంగాణలోని మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు సదుపాయం కల్పించాక.. ఆర్టీసీ బస్సుల్లో చిత్రవిచిత్రాల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కో ఘటన వెలుగులోకి వస్తోంది. పథకం అమల్లోకి వచ్చిన వెంటనే కనిపించిన కామన్ సీన్.. మహిళల సిగపట్లు. బస్సులో సీటు కోసం మహిళలు కొట్టుకున్న ఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. ఇక మెయిన్ డోర్ నుంచి ఎక్కలేక, తండ్రి వీపు పైకి ఎక్కి, కిటికీలోంచి బస్సులోకి దూకిన మహిళల వీడియోలు, చిత్రాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

తాజాగా సంగారెడ్డి బస్సులో మరో ఇద్దరు ఆడవాళ్లు సిగపట్లు పట్టుకున్నారు. జహీరాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం ఇద్దరు మహిళల మధ్య గొడవ చెలరేగింది. మాటల యుద్ధం శ్రుతిమించి సిగపట్లకు చేరుకుంది. ఇద్దరు ఏమాత్రం తగ్గలేదు. ఒకరికొకరు జుట్లు పట్టుకుని వీరంగం సృష్టించారు. వీళ్లిద్దరి మధ్య గొడవను చూసి.. మిగతా ప్రయాణికులంతా కంగారుపడిపోయారు. మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు కిటకిటలాడుతున్నారు. అందరూ ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తుండటంతో.. కిక్కిరిసిపోతున్నాయి. కాగా.. ఆర్టీసీ బస్సుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండం కలకలం రేపుతోంది. ఇప్పటికే రద్దీని నివారించేందుకు ప్రభుత్వం.. కొత్త ఆర్టీసీ బస్సులను సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది.




Updated : 1 Jan 2024 1:52 PM IST
Tags:    
Next Story
Share it
Top