శంషాబాద్లో మహిళ హత్య కేసులో పురోగతి
X
శంషాబాద్‌లో సంచలనం సృష్టించిన మహిళ దారుణ హత్య కేసులో పురోగతి లభించింది. హత్యకు గురైన మహిళను శంషాబాద్ మండలం రాళ్లగూడకు చెందిన మంజులగా గుర్తించారు. మంజుల 2 రోజుల క్రితం కడుపునొప్పి వస్తుందని, శంషాబాద్ ఆస్పత్రికి వెళ్తున్నట్లు భర్తకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. హాస్పిటల్ కు వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో భర్త శుక్రవారం సాయంత్రం పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆయన చెప్పిన పోలికలు మృతదేహంతో సరిపోలడంతో.. మంజుల హత్యకు గురైందని పోలీసులు నిర్ధారించారు.
ఇదిలా ఉంటే మంజులను ఎవరు హత్యచేశారన్న దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా మొబైల్ సిగ్నల్ ఆధారంగా మంజుల చివరగా ఎవరికి ఫోన్ చేశారన్న వివరాలను సేకరిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు.