Home > తెలంగాణ > Yadadri : యాదాద్రి పేరు మార్పు..ఇక యాదగిరి గుట్టనే : ప్రభుత్వ విప్ బీర్ల

Yadadri : యాదాద్రి పేరు మార్పు..ఇక యాదగిరి గుట్టనే : ప్రభుత్వ విప్ బీర్ల

Yadadri   : యాదాద్రి పేరు మార్పు..ఇక యాదగిరి గుట్టనే : ప్రభుత్వ విప్ బీర్ల
X

యాద్రాది పేరును మళ్లీ యాదగిరి గుట్టగా మారుస్తామని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తాజాగా స్పష్టం చేశారు. ఆలయాన్ని దర్శించిన సందర్బంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. కొండపై డార్మిటరీ హాల్ నిర్మించి భక్తులకు నిద్ర చేసే అవకాశన్ని కల్పిస్తామని ఆయన తెలిపారు. ఆలయ అధికారులు కోసం టాయిలెట్లు, రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నాం అని ఆయన తెలిపారు. నెల రోజుల్లోగా సమీక్ష సమావేశం నిర్వహించి క్షేత్రానికి పూర్వ సంప్రదాయం చేకూర్చేలా కృషి చేస్తానన్నారు. తొలుత ఈవో రామకృష్ణారావు, ధర్మకర్త నరసింహమూర్తి స్వాగతం పలికారు. దైవ దర్శనం చేసుకొని పూజలు నిర్వహించారు. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ వై.సుధ పాల్గొన్నారు.

యాదాద్రి అనే పేరును చినజీయర్ సూచించారు. ఆయన సూచన మేరకు పేరు ను కూడా మాజీ సీఎం కేసీఆర్ మార్చారని చెబుతారు. చినజీయర్‌తో వివాదం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆయనకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన యాదాద్రి పేరును కూడా మళ్లీ గుట్టగానే పిలవాలని డిసైడయినట్లుగా భావిస్తున్నారు. కొంత కాలంగా యాదాద్రి పేరును మళ్లీ యాదగిరి గుట్టగానే పిలవాలన్న డిమాండ్లు సోషల్ మీడియాలో కూడా వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ తెరపైకి వచ్చింది. యాదగిరి గుట్ట అనేది తెలంగాణ జన బాహుళ్యంలో విశ్లేష ప్రాచుర్యం పొందింది. నరసింహా స్వామి దగ్గరకు వెళ్లడం కన్నా గుట్టకు వెళ్లొద్దామా అనే మాట్లాడుకుంటారు. యాదాద్రి అని పేరు మార్చిన తర్వాత కూడా అది మారలేదు. దానికి తోడు చినజీయర్‌తో విభేధాలు కూడా కలిసి వచ్చి.. మళ్లీ యాదాద్రి పేరు యాదగిరి గుట్ట అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక నుంచి యాదాద్రి అనే పేరు ఎక్కువగా వినిపించకపోవచ్చని.. యాదగిరి గుట్టగానే ప్రాచుర్యంలోకి వస్తుందని భావిస్తున్నారు.

Updated : 2 March 2024 4:42 PM IST
Tags:    
Next Story
Share it
Top