Home > తెలంగాణ > కొల్లాపూర్‌ బరిలో బర్రెలక్క.. యానాం మాజీ మంత్రి విరాళం

కొల్లాపూర్‌ బరిలో బర్రెలక్క.. యానాం మాజీ మంత్రి విరాళం

కొల్లాపూర్‌ బరిలో బర్రెలక్క.. యానాం మాజీ మంత్రి విరాళం
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యువతకు ప్రధాన్యం పెరిగిపోతుంది. యువత కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధం అయ్యారు. ప్రధాన పార్టీలు చాలామందికి టికెట్లు ఇచ్చాయి. అయితే వారంతా రాజకీయ అనుభవం ఉన్న కుటుంబాల నుంచి వచ్చినవారే. అయితే తెలంగాణలో సంచలనం రేపుతున్న బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. ఓ పేద కుటుంబం నుంచి వచ్చి, ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎన్నికల బరిలో దిగింది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంది. సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా ఉండే బర్రెలక్క అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బీకాంలో డిగ్రీ పూర్తి చేసింది. చదువుకున్నా ఉద్యోగం రాకపోవడంతో బర్రెలు కాస్తూ.. సోషల్ మీడయాలో వీడియోలు తీస్తూ ఫేమస్ అయింది.

నిరుద్యోగం వల్ల తాను బర్రెలు కాయాల్సి వస్తుందని తన అసహనాన్న వీడియోల్లో చెప్తుండేది. అదే కారణంతో ఎన్నికల్లో నామినేషన్ వేసినట్లు శిరీష చెప్పుకొచ్చింది. కాగా తనను స్పూర్తిగా తీసుకున్న చాలామంది సపోర్ట్ ఇస్తున్నారు. కొంతమంది నిరుద్యోగులు అండగా నిలబడుతున్నారు. మరికొంతమంది ఎన్నికల ప్రచారం కోసం ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనేన పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు శిరీషకు రూ. లక్ష విరాళం ఇచ్చారు. ఆమె గెలవాలని కోరుకుంటూ.. ఫోన్లో అభినందనలు తెలిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఆలోచన ఉంటే బర్రెలక్కకు తాను సాయం చేస్తానని హామీ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువత సహకారంతో ఆమెను గెలిపించాలన్నారు. ఫలితం ఎలా వచ్చినా.. నిరుత్సాహపడొద్దని సూచించారు.

Updated : 19 Nov 2023 3:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top