Kotha Prabhakar Reddy : 10 రోజుల వరకు హాస్పిటల్లోనే కొత్త ప్రభాకర్ రెడ్డి
X
థంబ్ : చిన్న పేగు 15 సెంటీమీటర్ల మేర తొలగింపు
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి యశోద హాస్పిటల్ డాక్టర్లు వెల్లడించారు. ఆయన పొట్ట కుడిభాగంగా 6 సెంటీమీటర్ల కత్తిగాటు పడిందని అన్నారు. సీటీ స్కాన్లో శరీరంలో బ్లీడింగ్ అవుతున్నట్లు గుర్తించామని, చిన్న పేగును 15 సెంటీమీటర్ల మేర తొలగించినట్లు చెప్పారు. వీలైనంత తొందరగా హాస్పిటల్కు రావడంతో ఇన్ఫెక్షన్ ముప్పు తప్పిందని అన్నారు. 10 రోజుల వరకు ప్రభాకర్ రెడ్డిని డిశ్చార్జ్ చేసే పరిస్థితి లేదని డాక్టర్లు స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే కత్తిపోటు అనంతరం ప్రభాకర్ రెడ్డికి గజ్వేల్ హాస్పిటల్ డాక్టర్లు గాయానికి కుట్లు వేసి హైదరాబాద్ తరలించారు. యశోద హాస్పిటల్ డాక్టర్ల బృందం దాదాపు 3 గంటల పాటు సర్జరీ చేసి చిన్న పేగు తొలగించారు. 4 రోజుల తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి వార్డుకు షిఫ్ట్ చేస్తామని డాక్టర్లు చెప్పారు.