Home > ఆంధ్రప్రదేశ్ > వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితా పూర్తి విడుదల

వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితా పూర్తి విడుదల

వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితా పూర్తి విడుదల
X

ఏపీ సీఎం జగన్ 2024 అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇడుపుపాయలో తన తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం జబితాను వెల్లడించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎమ్మెల్యేల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. ఇక ఎంపీల జాబితాను ఎంపీ నందిగం సురేశ్ వెల్లడించారు. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 14 మంది సిట్టింగ్ ఎంపీలను పక్కనపెట్టారు.మొత్తం అభ్యర్థుల జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% సీట్లు కేటాయించారు. 84 ఎమ్మెల్యే 16 మంది ఎంపీ సీట్లు బడుగు బలహీన వర్గాలకు కేటాయించారు.

ఎంపీ అభ్యర్థులు వీళ్లే


అరకు - తనూజ రాణి

శ్రీకాకుళం - పేరాడ తిలక్‌

విజయనగరం - బెల్లాన చంద్రశేఖర్‌

విశాఖపట్నం - బొత్స ఝాన్సీ

కాకినాడ - చలమశెట్టి సునీల్‌

అమలాపురం - రాపాక వరప్రసాద్‌

రాజమండ్రి - గూడూరు శ్రీనివాసరావు

నరసాపురం - ఉమాబాల

ఏలూరు - కారుమూరి సునీల్‌కుమార్‌

మచిలీపట్నం - సింహాద్రి చంద్రశేఖర్‌రావ్‌

విజయవాడ - కేశినేని శ్రీనివాస్‌

గుంటూరు - కిలారి వెంకట రోశయ్య

నరసరావుపేట - పోలుబోయిన అనిల్‌కుమార్‌

బాపట్ల - నందిగం సురేశ్‌

ఒంగోలు - చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

నంద్యాల - పోచా బ్రహ్మానందరెడ్డి

కర్నూలు - బీవై రామయ్య

అనంతపురం - మాలగుండ్ల శంకర నారాయణ

హిందూపురం - జోలదరాశి శాంత

కడప - వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి

నెల్లూరు - విజయసాయి రెడ్డి

తిరుపతి - మద్దెల గురుమూర్తి

రాజంపేట - మిథున్‌రెడ్డి

చిత్తూరు - ఎన్‌ రెడ్డెప్ప

Updated : 16 March 2024 1:47 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top