అమ్మాయి వేషం వేసుకుని.. షాపులో ఏం చేశాడంటే..?
X
దొంగలు తెలివిమీరిపోతున్నారు. ఎవరికి దొరకకుండా ఉండేందుకు సరికొత్త వేషాలు వేస్తున్నారు. కొత్తగా ఆలోచిస్తున్నాం అనుకుని చెత్త పనులతో పోలీసులకు కటకటాల పాలవుతున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో జరిగిన చోరీ నెట్టింట వైరల్గా మారింది.
సింగారం గ్రామంలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ నడిపిస్తున్నాడు. సెప్టెంబర్ 9న రాత్రి లక్ష్మీ నారాయణ దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. సెప్టెంబర్ 11న ఉదయం దుకాణానికి వచ్చి చూడగా.. వెనుక ఉన్న తలుపు తీసి ఉన్నట్లు ఉంది. కౌంటర్ తెరిచి చూడగా.. అందులో ఉన్న రూ.3500 నగదు లేదు. దీంతో ఆందోళన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీటీవీ పుటేజీలను పరిశీలించారు.
సీసీటీవీ పుటేజీలో ఓ లేడీ దొంగతనం చేసినట్లుగా ఉంది. దీంతో మహిళా దొంగ ఎవరనే కోణంలో విచారణ జరిపారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ షాకింగ్ విషయాన్ని కనుగొన్నారు. దొంగతనం చేసింది మహిళ కాదు షాప్ బిల్డింగ్ ఓనర్ కొడుకు సుధీర్ అని గుర్తించారు. జల్సాలకు అలవాటు పడిన సుధీర్.. ఎవరికీ దొరకకుండా ఉండేందుక మహిళా వేశం వేసుకుని దొంగతనం చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. అయితే విలువైన ఆస్తులు ఉన్న సుధీర్ కేవలం 3500 కోసం కక్కుర్తిపడి కటకటాల పాలవడం గమనార్హం.