Youth Congress : అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో యూత్ కాంగ్రెస్ నేతలు
X
శాసనసభ సమావేశాల తొలిరోజు అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నిరసనకు దిగారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ వైపునకు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు.
Youth Congressగ్రూప్ 2 అభ్యర్థులు సైతం అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మూడు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్, ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేశారు.అసెంబ్లీ పరిసరాల్లో ధర్నాలు రాస్తారోకోలు, నిరసనలపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లాంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.