Home > తెలంగాణ > నన్ను వేధిస్తున్నారు.. హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ నాని

నన్ను వేధిస్తున్నారు.. హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ నాని

నన్ను వేధిస్తున్నారు.. హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ నాని
X

విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో.. అక్కడి 50 బోట్లు కాలిపోయి, దాదాపు రూ.60 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రముఖ యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనలో అతని ప్రమేయం లేకపోయినా ఇబ్బంది పెడుతున్నారని.. కావాలనే కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై హెబియస్ కార్పస్ కింద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు చెప్పారు.

ఈ అగ్ని ప్రమాద ఘటనకు తనకు సంబంధం లేదని నాని అన్నాడు. ప్రమాదం జరిగినప్పుడు తాను అక్కడ లేనని, రాత్రి 11 తర్వాత నాకు ప్రమాదం గురించి సమాచారం అందిందని మీడియా ముఖంగా వెల్లడించాడు. ప్రభుత్వానికి సమాచారం అందించాలనే ఉద్దేశంతోనే తాను అక్కడికి వెళ్లినట్లు చెప్పాడు. ‘ప్రమాదం గురించి అందరికీ తెలియాలని, మత్యకారులకు సాయంగా ఉంటుందనే వీడియో తీశా. దానికి విచారణ పేరుతో పోలీసులు పిలిపించుకుని దారుణంగా కొట్టారు. నేను తప్పు చేయలేదని చెప్పినా వినిపించుకోలేదు. ప్రమాదం జరిగిన సమయంలో నేనెక్కడున్నానో సీసీటీవీల్లో చూస్తే అర్థం అవుతుంది. నాతో పాటు మరో నలుగురు అమాయకుల్ని కూడా అరెస్ట్ చేశారు. హైకోర్టులో పిటిషన్ వేయగానే మమల్ని బెదిరించార’ని నాని ఆవేదన వ్యక్తి చేశాడు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరారు. కాగా, నాని తన భార్య సీమంతం పార్టీ చేసుకోవడం వల్లే ప్రమాదం జరిగిందని తొలుత వార్తలొచ్చాయి.



Updated : 24 Nov 2023 1:52 PM IST
Tags:    
Next Story
Share it
Top