బీఆర్ఎస్ కంటపడితే ఖేల్ ఖతం దుకాణం బంద్ - వైఎస్ షర్మిల
X
సీఎం కేసీఆర్పై వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు సంధించారు. కేసీఆర్ ను కరోనా కన్నా డేంజర్ వైరస్ తో పోల్చారు. తెలంగాణ సమాజాన్ని పీడించే కేసీఆర్ కన్నా పెద్ద వైరస్ ఏదీ రాదని అన్నారు. బీఆర్ఎస్ దరిద్రపు పాలనే తెలంగాణ ప్రజలను పట్టిపీడించే అతిపెద్ద వైరస్ అని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఖజానా ఖాళీచేయడానికే కేసీఆర్ పాలన పుట్టిందని షర్మిల విమర్శించారు. ప్రజలను అప్పుల పాలు చేసేందుకు ఆ వైరస్ పట్టుకుందని అన్నారు. కరోనాపై పోరాడి గెలిచినా.. బీఆర్ఎస్ వైరస్ కంట పడితే మాత్రం ఖేల్ ఖతం.. దుకాణం బంద్ అని సటైర్ వేశారు.
పునాది రాయి ఎందుకు పడలేదు
రాష్ట్రంలో వైద్యరంగాన్ని ఉద్దరించినట్లు దొరగారు ఉద్దెర మాటలు చెబుతున్నారని షర్మిల మండిపడ్డారు. నిమ్స్ విస్తరణకు కొబ్బరి కాయ కొట్టిన ముఖ్యమంత్రి గతంలో చేసిన శంకుస్థాపనల సంగతేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రూ. 1500 కోట్లతో ఉస్మానియా దవాఖానకు కడతామని చెప్పిన ట్విన్ టవర్స్ ఎక్కడ..? నగరం నలుమూలల 4 పెద్దాసుపత్రులు ఎక్కడ..? అక్కడ కార్పొరేట్ వైద్యం ఏమాయేనని ప్రశ్నించారు. కొబ్బరికాయ కొట్టి 14 నెలలైనా పునాదిరాయి ఎందుకు పడలేదని షర్మిల నిలదీశారు.
ఇంజెక్షన్ రెడీ
సీఎం కేసీఆర్ విలాసాలకు కొత్త సచివాలయం మీద పెట్టిన శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషన్ల మీద పెట్టిన దృష్టి వైద్యాభివృద్ధి మీద ఎందుకు చూపడంలేదని అన్నారు. పదేండ్లలో కొబ్బరికాయలు, శంకుస్థాపనలు మినహా సాధించినదేమీ లేదన్న షర్మిల కేసీఆర్ మహమ్మారి పాలన అంతానికి ఇంజెక్షన్ రెడీ అయిందని అన్నారు.
కరోనా కంటే మించిన వైరస్ లు వస్తాయని జ్యోస్యం చెప్పే దొర..
— YS Sharmila (@realyssharmila) June 15, 2023
తెలంగాణ సమాజాన్ని పట్టి పీడించే మీ కంటే పెద్ద వైరస్ ఏది రాదు లే !
మీ దరిద్రపు పాలనే తెలంగాణ ప్రజలను పట్టి పీడించే అతి పెద్ద వైరస్
రాష్ట్ర ఖజానా ఖాళీ చెయ్యడానికే పుట్టిన మహమ్మారి మీ పాలన
ప్రజలను అప్పుల పాలు చెయ్యడానికి…