Home > తెలంగాణ > కాంగ్రెస్ సర్కారుకు మా సహకారం అందిస్తాం.. వైఎస్ షర్మిల

కాంగ్రెస్ సర్కారుకు మా సహకారం అందిస్తాం.. వైఎస్ షర్మిల

కాంగ్రెస్ సర్కారుకు మా సహకారం అందిస్తాం.. వైఎస్ షర్మిల
X

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుమల రేవంత్ రెడ్డికి వైయస్ఆర్‭టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు మిగతా మంత్రివర్గానికి బెస్ట్ విషెస్ అందించారు. ఎన్నికలకు ముందు షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో.. తెలంగాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ పార్టీకి ఆమె శుభాకాంక్షలు తెలిపారు.



ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ... " తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇదే మా మనఃపూర్వక శుభాకాంక్షలు. పదేండ్ల నియంత పాలనను నిలువునా పాతిపెడుతూ, మీ మీద నమ్మకంతో, సరికొత్త ఆశలతో కాంగ్రెస్ కు పట్టంకడుతూ తెలంగాణ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఒక అద్భుతం ఐతే, ఇప్పుడు ఏర్పాటు చేసిన ప్రజా ప్రభుత్వం మరొక్క మహత్తర ఘట్టం, ఇది సుపరిపాలనకు నాంది అని కూడా మేము ఆశిస్తున్నాం. ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా, నిబద్ధత, నిస్పాక్షికతకు మారుపేరుగా ఈ సర్కారు ఉండబోతోంది, ఇది నూటికి నూరుశాతం నాలుగు కోట్ల ప్రజల నమ్మకం. YSR తెలంగాణ పార్టీ తరపున కాంగ్రెస్ సర్కారుకు ఎల్లవేళలా సహకారం, మద్దతు, మనస్ఫూర్తిగా అందించడానికి మేము సిద్దమే అని సంతోషంగా తెలియజేస్తున్నాము"అని పోస్ట్ చేశారు.

Updated : 8 Dec 2023 5:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top