Home > తెలంగాణ > సీఎం రేవంత్ రెడ్డితో షర్మిల భేటీ..

సీఎం రేవంత్ రెడ్డితో షర్మిల భేటీ..

సీఎం రేవంత్ రెడ్డితో షర్మిల భేటీ..
X

ఏపీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల దూకుడు పెంచింది. ఏపీ వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రభుత్వంపై విరుచుకపడుతోంది. ప్రత్యేక హోదా అంశంపై ఢిల్లీలోనూ దీక్ష చేసింది. శరద్ పవార్, సీతారాం ఏచూరీ వంటి జాతీయ నాయకులను కలిసి ఏపీకి ప్రత్యేక హోదాకు మద్ధతు ఇవ్వాలని కోరారు. ప్రతి రోజు ఏపీలో ఏదో ఒక నియోజకవర్గంలో పర్యటిస్తూ జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతోంది. ఈ క్రమంలో ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డితో షర్మిల భేటీ అయ్యారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె రేవంత్ను కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై చర్చించారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతం సహా లోక్ సభ ఎన్నికలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

Updated : 12 Feb 2024 10:03 PM IST
Tags:    
Next Story
Share it
Top