Home > తెలంగాణ > కాళేశ్వరంతో నీళ్లు రాలేదని చిన్న దొరే ఒప్పుకుండు - షర్మిల

కాళేశ్వరంతో నీళ్లు రాలేదని చిన్న దొరే ఒప్పుకుండు - షర్మిల

కాళేశ్వరంతో నీళ్లు రాలేదని చిన్న దొరే ఒప్పుకుండు - షర్మిల
X

మంత్రి కేటీఆర్పై వైఎస్సాఆర్టీపీ చీఫ్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు రాలేదని, కేవలం భూగర్భ జలాలు మాత్రమే పెరిగాయని స్వయంగా కేటీఆర్ నిస్సిగ్గుగా ఒప్పుకున్నారని ట్వీట్ చేశారు. మాజీ సీఎం వైఎస్ కేవలం గ్రావిటీ ద్వారా రూ.38వేల కోట్లతోనే ప్రాణహిత చేవెళ్లను పూర్తి చేయాలని భావిస్తే.. పెద్ద దొర కేసీఆర్ కమీషన్లు దోచుకోవడానికి రీడిజైనింగ్ పేరుతో రూ.1.25 లక్షల కోట్లకు పెంచాడని ఆరోపించారు. సగం నిధులు కాజేసి, వేల కోట్ల కరెంటు బిల్లులకు కారణమయ్యే ప్రాజెక్టును ముంగటేస్తే అది మూణ్నాళ్లకే మునిగిందని షర్మిల విమర్శించారు.

కాళేశ్వరంతో 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పిన పెద్ద దొర.. కేవలం 1.50లక్షల ఎకరాలకే నీళ్లు ఇచ్చారని షర్మిల అన్నారు. హరీష్ రావు స్వయంగా అసెంబ్లీలో ఈ విషయం చెప్పారని గుర్తు చేశారు. 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు రూ.1.25లక్షల కోట్లు ఖర్చు చేసిన అపరమేధావి కేసీఆర్ అని షర్మిల చెప్పారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని అంటామని, దోచుకోవడం, దాచుకోవడమే వాళ్ల పని అని విమర్శించారు.




Updated : 16 Aug 2023 4:11 PM GMT
Tags:    
Next Story
Share it
Top