Home > తెలంగాణ > YS Sharmila: బతుకుపై ధీమా ఇవ్వకుండా పోయినంక బీమా ఇస్తడంట - వైఎస్ షర్మిల

YS Sharmila: బతుకుపై ధీమా ఇవ్వకుండా పోయినంక బీమా ఇస్తడంట - వైఎస్ షర్మిల

YS Sharmila: బతుకుపై ధీమా ఇవ్వకుండా పోయినంక బీమా ఇస్తడంట - వైఎస్ షర్మిల
X

కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో కొండంత రాగం తీసి పిల్లికూత కూసినట్లుందని వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి .. మళ్లీ కొత్త కథ మొదలుపెట్టిండని విమర్శించారు. బతుకు మీద ఇవ్వాల్సిన ధీమాను పక్కనపెట్టి పోయాక బీమా ఇస్తానని అంటున్నాడని మండిపడ్డారు.

గతంలో సున్నా వడ్డీకే రుణాలిస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతి మహిళకు నెలకు 3 వేలు ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందని షర్మిల అన్నారు. నిరుద్యోగ భృతి అని గత మేనిఫెస్టోలో పెట్టిన పథకానికే దిక్కులేదు కానీ ఇప్పుడు 3 వేలు ఇస్తామంటే నమ్మాలా? అని ప్రశ్నించారు. విడతల వారీగా పెన్షన్ల పెంపు ఒక పెద్ద జోక్ అన్న ఆమె.. రుణమాఫీపై కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నాడని, ఉద్యోగాలు ఇవ్వలేక ఏనాడో చేతులెత్తేశారని విమర్శించారు. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను పాతర పెట్టి ఓట్ల కోసం కొత్త పథకాలంటూ డ్రామాలు మొదలుపెట్టారని, బందిపోట్ల సమితి మేనిఫెస్టో ఓట్ల కోసమే తప్ప ప్రజల కోసం కాదని షర్మిల అభిప్రాయపడ్డారు.

Updated : 15 Oct 2023 9:43 PM IST
Tags:    
Next Story
Share it
Top