Home > తెలంగాణ > గద్దరన్న ఇక లేడన్న విషయం కలిచివేస్తోంది - వైఎస్ షర్మిల

గద్దరన్న ఇక లేడన్న విషయం కలిచివేస్తోంది - వైఎస్ షర్మిల

గద్దరన్న ఇక లేడన్న విషయం కలిచివేస్తోంది - వైఎస్ షర్మిల
X

ప్రజా పోరాటాల మహాశిఖరం ఒరిగిపోయిందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి అన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత విషాదభరితమైన వార్త అని, గద్దర్ అన్న ఇక లేడన్న విషయం కలిచివేస్తోందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బాట, పాట భావితరాలకు చుక్కానిలా, బడుగు దీన జనుల గుండెల్లో ఆశాదీపంగా అజరామరంగా నిలుస్తుందని ట్వీట్ చేశారు.

"ఇది అత్యంత విషాదభరితమైన వార్త. ప్రజాపోరాటాల మహా శిఖరం ఒరిగిపోయింది, మానవత్వం, త్యాగనిరతి, మహోన్నతమైన వ్యక్తిత్వం, ప్రజల గొంతు మూగపోయింది. గద్దరన్న ఇక లేడన్న వార్త కలిచివేసేదిగా ఉంది. యావత్ జీవితం ప్రజల కొరకు చేసే పోరాటాలకు అంకితం చేసిన మీ బాట, మీ పాట భావితరాలకు చుక్కానిగా, బడుగు దీనజనుల గుండెల్లో ఆశాదీపంగా అజరామరంగా నిలుస్తుంది. సలసల మండే గుండెమంటల రాగంతో, వలవల జారే కన్నీళ్ళ తాళంతో పాడిన ప్రతి గేయం అమరం. ఓ పోరాటయోధుడా అందుకో సలాం…" అంటూ షర్మిల ట్విట్టర్లో రాశారు.

Updated : 6 Aug 2023 6:05 PM IST
Tags:    
Next Story
Share it
Top