Home > తెలంగాణ > వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత..

వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత..

వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత..
X

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్ అయ్యారు. ఆమె ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. ఈ క్రమంలో పర్యటనకు అనుమతి లేదని పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అయితే పోలీసుల తీరుపై షర్మిల ఫైర్ అయ్యారు. పోలీసులకు హారితి ఇచ్చి.. ఇంటిబయటే బైఠాయించారు. గజ్వేల్ పర్యటను అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అడ్డుకున్నా పర్యటనకు వెళ్తానని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ దాడులకు భయపడేది లేదని షర్మిల అన్నారు. పోలీసు బలగాలు తన పర్యటనను అడ్డుకోలేవన్పారు. ప్రాణాలు ఇచ్చైనా ప్రజల కోసం కొట్లాడతానని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం తేవాలన్నదే తమ లక్ష్యమన్నారు. కాగా దళితబంధులో అక్రమాలు జరిగాయంటూ ఇటీవల గజ్వేల్‌లోని జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌ గ్రామస్థులు ఆందోళన చేశారు. వారికి మద్దతుగా అక్కడ పర్యటించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు పర్యటనకు అనుమతి లేదని అడ్డుకున్నారు.





Updated : 18 Aug 2023 11:42 AM IST
Tags:    
Next Story
Share it
Top