Home > తెలంగాణ > బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌.. బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ

బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌.. బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ

బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌.. బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ
X

లోక్‌సభ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ఎంపీలు కారు దిగి.. హస్తం గూటికి , కమల దళంలోకి వెళ్తున్నారు. తాజాగా మరో ఎంపీ కూడా బీజేపీలో చేరాన్నారు. జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్(,B B Patil) బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాసేపటి క్రితం కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, పార్టీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పాటిల్‌ బరిలోకి దిగనున్నారు. బీజేపీ హైకమాండ్ ఆయనకు జహీరాబాద్ టికెట్ కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు బీబీ పాటిల్. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు లేఖను పంపించారు. జహీరాబాద్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలని తన లేఖలో పేర్కొన్నారు బీబీ పాటిల్.

2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన బీబీ పాటిల్.. అదే ఏడాదిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సురేష్ కుమార్ షెట్కార్‌పై గెలిచారు. 2019న మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి.. సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ రావుపై 6166 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో.. ఇప్పుడు ఎంపీలంతా ఆ పార్టీని వీడుతున్నారు.ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు రాజీనామా చేశారు. వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరగా.. రాములు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

కాగా తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని బీజేపీ వ్యూహారచన చేస్తుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలపై ఇతర పార్టీలపై ఫోకస్ పెట్టి.. వారిని తమ పార్టీలోకి చేర్చుకుంటుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించగా... కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎం ఒక్క స్థానంలో విజయం సాధించింది. మిగిలిన స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది.




Updated : 1 March 2024 4:55 PM IST
Tags:    
Next Story
Share it
Top