ZP CEOs and DPOs Transferred : తెలంగాణలో భారీగా జడ్పీ సీఈవోలు, డీపీవోల బదిలీ
X
తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతోన్నాయి. ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్లు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలను బదిలీ చేసిన రేవంత్ సర్కార్ తాజాగా పంచాయతీ రాజ్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది. జడ్పీ సీఈవోలు, డిప్యూటీ సీఈవోలతో పాటు డీపీవోలను బదిలీ చేస్తూ పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 105 మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. అటు ఎక్సైజ్ శాఖ అధికారులను సైతం సర్కార్ ట్రాన్స్‌ఫర్ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఆదివారం 395మంది ఎంపీడీవోలు ట్రాన్స్ ఫర్ చేసింది. అంతకుముందు 132 మంది ఎమ్మార్వోలు, 32మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. కాగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు కొనసాగుతున్నాయి. సొంత జిల్లాలో పనిచేస్తున్నా వారితో పాటు గత మూడేళ్ల నుంచి ఒకే చోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ఈసీ స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం అధికారుల బదిలీ ప్రక్రియ చేపట్టింది.