Home > Telangana 10 Years > రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ 2కే రన్.. 'డీజే' స్టెప్పులతో అదరగొట్టిన మంత్రి మల్లారెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ 2కే రన్.. 'డీజే' స్టెప్పులతో అదరగొట్టిన మంత్రి మల్లారెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ 2కే రన్.. 'డీజే' స్టెప్పులతో అదరగొట్టిన మంత్రి మల్లారెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ 2కే రన్.. డీజే స్టెప్పులతో అదరగొట్టిన మంత్రి మల్లారెడ్డి
X



తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ 2కే రన్‌ను (Telangana 2k run) ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉత్సాహంగా రన్‌ కొనసాగింది. పోలీస్‌ వాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో అంబేద్కర్‌ విగ్రహం వద్ద మంత్రి మహమూద్‌ అలీ 2కే రన్‌ను స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, క్రీడాకారులు నిఖత్‌ జరీన్‌, ఈషా సింగ్‌, సింగర్స్ మంగ్లీ, రామ్‌ మిర్యాల, సినీ నటి శ్రీలీల పాల్గొన్నారు. నాలుగు వేలకుపైగా రన్నర్లు ఈ 2కే రన్‌లో పాల్గొన్నారు.

ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల చౌరస్తాలో నిర్వహించిన 5K రన్ కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన స్టెప్పులు ఇరగదీస్తూ తెగ హైలైట్ అయ్యారు. ఇక అక్కడ యువతీయువకుల నడుమ చిందేస్తూ సందడి చేశారు. అంతేనా? విజేతలకు ఇచ్చే ట్రోఫీ పట్టుకొని చిందులు వేస్తూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం మహిళా కళాకారులతో బతుకమ్మ పాటలకు ఆడి పాడారు. 70 ఏళ్ల వయసులో సైతం మల్లారెడ్డి స్టెప్పులతో అదరగొట్టడం అందరినీ ఆకట్టుకుంటోంది.


ఇక రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రన్‌ను మంత్రి నిరంజన్‌ రెడ్డి, జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, నిర్మల్‌ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, కామారెడ్డిలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభించారు. నల్లగొండ పట్టణంలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి ఖిల్లాపై తిరంగా యాత్ర నిర్వహించారు. కోట వద్ద జాతీయ జెండాను ఎగుర వేశారు.



Updated : 12 Jun 2023 12:19 PM IST
Tags:    
Next Story
Share it
Top