ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై హత్యాయత్నం కేసు..
X
బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు ఆయన కొడుకుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఆదివారం రాత్రి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో బీఎస్పీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రవీణ్ కుమార్ ట్విటర్లో ఈ సంగతి వెల్లడించారు. సిర్మూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రోద్బలంతోనే కేసులు పెట్టారని ఆరోపించారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న తన కొడుకుతోపాటు 11 మంది బీఎస్పీ నేతలపై 307 సెక్షన్ కింద వీటిని నమోదు చేశారని తెలిపారు. బీఎస్పీ బహిరంగ సభ దగ్గరికి బీఆర్ఎస్ ప్రచార వాహనాలు పెద్ద శబ్దంతో పాటు పెట్టుకుంటూ రావడంతో గొడవ జరిగింది.
‘‘నేను ఎమ్మెల్యే వాహనం నుంచి రూ. 25 వేలు దొంగిలించినట్లు అతని డ్రైవర్ ఫిర్యాదు చేశాడు. ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని, 26 ఏళ్లు ఎటువంటి మచ్చలేకుండా సేవ చేసిన అధికారిని.. నాపైనే కేసు పుట్టారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఇరవై ఏళ్లుగా కోనేరు కోనప్ప వల్ల సిర్పూరు కాగజ్‌నగర్ ప్రజలకు జరుగుతున్నదేమిటో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. మీ అక్రమ కేసులకు భయపడేది లేదు. సిర్పూరును విముక్తి చేసి తెలంగాణలో కలిపేదాకా మడమ తిప్పేది లేదు. బీఆర్ఎస్, బీజేపీ కూటమి కుట్రల నుండి తెలంగాణను కాపాడుతాం’’ అని ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.