కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారు : అసదుద్దీన్ ఓవైసీ
X
తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 30న రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల వేటలో ఉన్నాయి. నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు.
ఈ క్రమంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాము పోటీచేసే ప్రతిచోట గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మూడోసారి కేసీఆర్ సీఎం ఖాయమని అన్నారు. రాజస్థాన్ లోని పలు స్థానాల్లోనూ ఎన్నికల బరిలోకి దిగుతామని ఓవైసీ స్పష్టం చేశారు. బీజేపీ బీ టీం అంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై ఓవైసీ మండిపడ్డారు. 2004, 2008లో వామపక్షాలు తమ మద్ధతును ఉపసంహరించుకున్నప్పటికీ.. తాము మాత్రం కాంగ్రెస్ వెంటే ఉన్నామని గుర్తు చేశారు. వాటన్నింటిని మర్చిపోయి కాంగ్రెస్ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.