Home > తెలంగాణ > Telangana Elections 2023 > కార్పొరేటర్లను నమ్ముకున్న మజ్లిస్.. టికెట్లన్నీ వారికే

కార్పొరేటర్లను నమ్ముకున్న మజ్లిస్.. టికెట్లన్నీ వారికే

కార్పొరేటర్లను నమ్ముకున్న మజ్లిస్.. టికెట్లన్నీ వారికే
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టికెట్లు కేటాయింపు విషయంలో మజ్లిస్ పార్టీ కార్పొరేటర్లకే ప్రాధాన్యం ఇచ్చింది. ఎక్షలన్స్ లో మజ్లిస్ పార్టీ తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తుండగా.. అందులో ఎనిమిది టికెట్లను కార్పొరేటర్లకే కేటాయించింది. చాంద్రాయణ్ గుట్ట నుంచి పోటీ చేస్తున్న అక్బరుద్దీన్ మినహా.. మిగతా అభ్యర్థులంతా గతంలో కార్పోరేటర్లుగా పనిచేసినవాళ్లే. గతంలో పత్తర్‌‌‌‌గట్టీ కార్పొరేటర్‌‌‌‌గా పని చేసిన అహ్మద్‌‌‌‌ బిన్‌‌‌‌ అబ్దుల్లా బలాలా.. 2009 నుంచి మలక్‌‌‌‌పేట్‌‌‌‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మాజీ కార్పొరేటర్ జాఫర్ హుస్సేన్ మెరాజ్ కు గతంలో నాంపల్లి టికెట్ ఇవ్వగా.. పార్టీ ఈసారి ఆయనకు యాకత్ పుర టికెట్ కేటాయించింది.

కార్వాన్ నుంచి పోటీ చేస్తున్న కౌసర్ మొహినోద్దీన్ కుడా గతంలో కార్పొరేటర్ గా పనిచేశారు. మేయర్ గా సేవలందించిన జుల్ఫికర్ అలీ చార్మీనార్ స్థానంలో నిలబడ్డారు. మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ నాంపల్లి నుంచి, షేక్ పేట్ కార్పొరేటర్ మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ జూబ్లీహిల్స్ నుంచి పోటీకి సిద్ధం అయ్యారు. లంగర్ హౌస్ మాజీ కార్పొరేటర్ రవి యాదవ్ రాజేంద్రనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. 20 ఏళ్ల నుంచి శాస్త్రీపురం కార్పొరేటర్ గా పనిచేస్తున్న మహ్మద్ ముబీన్ ను బహదూర్ పుర నుంచి పోటీకి దింపుతుంది మజ్లిస్.




Updated : 10 Nov 2023 5:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top