TS Assembly Elections 2023 : మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయేది వీరే..
X
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి అంతా సిద్ధమైంది. ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు గవర్నర్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ పెద్దలు సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. రేవంత్ తో పాటు మరికొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి , కొండా సురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణారావు.. మొత్తం 11 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం ఏఐసీసీ నేతలు హైదరాబాద్ వచ్చారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi), కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు .. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా వారికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఏఐసీసీ నేతలకు స్వాగతం పలికిన వారిలో మాణిక్ రావ్ థాక్రే, శ్రీధర్ బాబు ఉన్నారు.