రాహుల్ గాంధీకి అసదుద్దీన్ సవాల్.. దమ్ముంటే..!
X
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతుంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి మరోసారి సవాల్ విసిరారు. రాహుల్ కు దమ్ముంటే హైదరాబాద్ కు వచ్చి పోటీచేయాలని, అప్పుడే ఎంఐఎం సత్తా ఏంటో చూపిస్తామని చెప్పుకొచ్చారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆ పార్టీ మధ్య వాతావరణం మరింత వేడెక్కుతుంది. రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ ఎంఐఎంపై ఆరోపణలు చేశారు. ఎంఐఎం బీజేపీ కోసం పనిచేస్తుందని, కాంగ్రెస్ ను ఓడించేందుకు దేశం మొత్తంలో పోటీకి దిగుతుందని అన్నారు.
దానికి ప్రతిగా తాము యూపీఏకు మద్దతు ఇవ్వడానికి ఎంత డబ్బు ఇచ్చారని అసదుద్దీన్ కౌటర్ వేశారు. 2008లో జరిగిన న్యూక్లియర్ డీల్‌లో మద్దతు ఇచ్చినందుకు, రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి మద్దతు తెలిపినందుకు ఎంత డబ్బిచ్చారని రాహుల్ ను ప్రశ్నించారు. ఈ క్రమంలో తాజాగా రాహుల్ కు దమ్ముంటే హైదరాబాద్ కు వచ్చి పోటీ చేయాలని, అప్పుడు ఎంఐఎం సత్తా ఏంటో చూపిస్తామని సవాల్ విసిరారు. రానున్న ఎలక్షన్స్ లో ప్రజలు కేసీఆర్ కు మద్దతివ్వాలని కోరారు. రాష్ట్రంలో త్రిముఖ పోరు ఉందన్న మాట వాస్తవం అని, కాంగ్రెస్ ను ఓడించేందుకే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని ఆరోపించారు.