Bandi Sanjay : ఎగ్జిట్ పోల్స్ను తారుమారు చేస్తం.. డిసెంబర్ 3న మేమేంటో చూపిస్తం
X
ఎగ్జిట్ పోల్స్ తారుమారవుతాయని, డిసెంబర్ 3న తమ సత్తా ఏంటో చూపిస్తామని బీజేపీ నేత బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ తో సహా తెలంగాణలో బీజేపీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కూడా బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని అన్నారని, జీహెచ్‌ఎంసీ, దుబ్బాకలో బీజేపీ గెలిచి చూపించిందని గుర్తు చేశారు. పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. తన గెలుపులో బీజేపీ కార్యకర్తలే అసలైన హీరోలని, నెలరోజుల పాటు బీజేపీ గెలుపు కోసం పని చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఎవరికి వారు సీఎం అవ్వాలనుకోవడంలో తప్పులేదని, చివరికి కేఏ పాల్ కూడా సీఎం అవుతానని చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా సహకరించిన మంద క్రిష్ణ మాదిగతోపాటు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలందరికి ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. బీజేపీట్ల విశ్వాసం, నరేంద్రమోదీ పట్ల నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.