Home > తెలంగాణ > Telangana Elections 2023 > Bandi sanjay : 70 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ఫండింగ్ : బండి సంజయ్

Bandi sanjay : 70 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ఫండింగ్ : బండి సంజయ్

Bandi sanjay  : 70 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ఫండింగ్ : బండి సంజయ్
X

బీఆర్ఎస్, కాంగ్రెస్పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. 70మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కేసీఆర్ ఫిండింగ్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్తారని అన్నారు. హుస్నాబాద్లో బీజేపీ అభ్యర్థికి మద్ధతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కరీంనగర్లో చెల్లని రూపాయి.. హుస్నాబాద్లో చెల్లుతుందా అని పొన్నంపై విమర్శలు గుప్పించారు.

బీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సంజయ్ పిలుపునిచ్చారు. కేసీఆర్ కుటుంబానికి రూ.లక్ష కోట్ల సంపాదన ఎలా వచ్చింది? అని నిలదీశారు.కొంతమంది పోలీసు అధికారులు కేసీఆర్ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తన కొడుకు కేటీఆర్‌ను సీఎం చేస్తే.. మరో నలుగురు సీఎం పదవి కోసం కొట్లాడుతారన్నారు. కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ ముఖ్యమంత్రులేనని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ హుస్నాబాద్‌కు ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని.. బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


Updated : 14 Nov 2023 5:09 PM GMT
Tags:    
Next Story
Share it
Top