Bandi Sanjay : రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ప్రశంసలు
X
తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ప్రశంసలు కురిపించారు. రేవంత్ గ్రౌండ్ లెవల్ నుంచి వచ్చారని.. ఆయనో పెద్ద ఫైటర్ అని అన్నారు. కేసీఆర్ తనను, రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేసేవారని ఆరోపించారు. తమను ఎంత ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. తాను ఓడినా.. బీజేపీని అధికారంలోకి తీసుకరావడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడం సంతోషంగా ఉందని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని.. ఎట్టకేలకు అవినీతి పాలనను ప్రజలు అంతిమొందిచారన్నారు. బీజేపీ గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. బండి సంజయ్ కు గెలుపోటములు కొత్త కాదని.. ఓడినా, గెలిచినా ప్రజల్లోనే ఉంటానని చెప్పారు. కరీంనగర్ లో ముస్లింలు ఒక్కటై కక్షగట్టి తనను ఓడించారని ఆరోపించారు. కాగా కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయారు.