Bandi Sanjay : బీసీలపై వ్యతిరేకత.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల డీఎన్‌ఏల్లోనే ఉంది: బండి సంజయ్
X
నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యువతను మత్తు పదార్థాలకు బానిసలను చేస్తుందని ఆరోపించారు. కరీంనగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్ఏల్లో బీసీలపై వ్యతిరేకత ఉందన్నారు. బీసీ, దళితులను సీఎం అభ్యర్థిగా ప్రకటించే దమ్ము బీఆర్ఎస్ పార్టీకి ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. వారిని కేసీఆర్ కొనుగోలు చేస్తారని అన్నారు. అందుకే కాంగ్రెస్ గెలవాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. నిన్నటి సభతో బీసీల్లో ప్రధాని మోదీ ఆత్మస్థైర్యం నింపారని, బీఆర్ఎస్ నుంచి విముక్తి పొందాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం లేదని, కాంగ్రెస్ ను గెలిపిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని ఆరోపించారు. కాగా రెండు రోజుల క్రితం కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి బండి నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.