Bandla Ganesh : రేవంత్ రెడ్డి జీవితంపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
X
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు గవర్నర్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ పెద్దలు సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే రేవంత్ రెడ్డే సీఎం అవుతారని బండ్ల గణేష్ ముందు నుంచే చెబుతున్నారు. ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందే వెళ్తానని అప్పట్లో ప్రకటించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఓకే అంటే ఆయన బయోపిక్ తీస్తానని చెప్పారు.
రేవంత్ రెడ్డి జీవితంలో ఎంతో మంది విలన్‌లు ఉన్నారని.. వారంతా ఆయన్ను జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారని బండ్ల గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అణిచివేయాలని చూసిన చోటే ఆయన నాయకుడిగా ఎదిగారన్నారు. రేవంత్‌కు ఆకలి, కసి, కష్టం, పాలన తెలుసని.. ఆయన సీఎం అవ్వడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాలలో గెలిపొందిన కాంగ్రెస్ జీహెచ్ఎంసీలో ఒక్క సీటు గెలవకపోవడం బాధ కలిగించిందన్నారు. రానున్న ఎన్నికల్లో హైదరాబాద్‌లోనూ కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అద్భుత పాలన చేస్తుందని.. హైదరాబాద్ వాసులు ఆదరించాలని కోరారు.