Bhatti Vikramarka : పంతం నెగ్గించుకున్న భట్టి.. ఆ పదవి చేపట్టనున్న ఒకే ఒక్కడు..
X
కాసేపట్లో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రులుగా ఎవరు ప్రమాణం చేస్తారనేదానిపై సస్పెన్స్ వీడింది. మంత్రుల లిస్ట్ను గవర్నర్కు కాంగ్రెస్ అందజేసింది. రేవంత్ తో పాటు 11మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి, కొండా సురేఖ, సీతక్క మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వీరిలో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పదవి చేపట్టనున్నారు.
భట్టి విక్రమార్క సీఎం పదవి కోసం తీవ్రంగా పోటీ పడ్డారు. ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలను సైతం కలిశారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం రేవంత్ రెడ్డినే సీఎంగా ఎంపిక చేసింది. ఈ క్రమంలో భట్టి అధిష్ఠానం వద్ద ఒక మెలిక పెట్టారు. కర్నాటకలో చేసినట్లుగా తనకు మాత్రమే డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని తేల్చి చెప్పారు. దీంతో అధిష్ఠానం భట్టికి మాత్రమే డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టింది. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం సీఎం పదవికి తీవ్ర పోటీ పడినా.. ఆయన మంత్రిగానే కొనసాగనున్నారు. ఈ 11 మందిలో పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటికి తప్ప మిగివారికి మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది.