Home > తెలంగాణ > Telangana Elections 2023 > Vivek Venkataswamy : రాహుల్‌తో భేటీ.. వివేక్‌కు చెన్నూరు టికెట్ కన్ఫామ్?

Vivek Venkataswamy : రాహుల్‌తో భేటీ.. వివేక్‌కు చెన్నూరు టికెట్ కన్ఫామ్?

Vivek Venkataswamy : రాహుల్‌తో భేటీ.. వివేక్‌కు చెన్నూరు టికెట్ కన్ఫామ్?
X

ఎన్నికల సమయంలో తెలంగాణ బీజేపీకి భారీ షాక్ తగిలింది. BJPకి రాజీనామా చేసిన మాజీ MP వివేక్ వెంకటస్వామి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేంద్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్న వివేక్ వెంకటస్వామి.. బీజేపీ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు వంశీ కూడా బీజేపీకి రాజీనామా చేశారు. అనంతరం జయభేరి బస్సు యాత్రలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన రాహుల్‌గాంధీని కలవడానికి కుటుంబ సమేతంగా శంషాబాద్ నోవాటెల్ హోటల్ కు వెళ్లారు. అక్కడ రాహుల్ గాంధీతో సమావేశమై కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ తో జరిగిన భేటీలో వివేక్ కు చెన్నూరు అసెంబ్లీ టికెట్, ఆయన కుమారుడు వంశీకి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్లు తెలిసింది. అయితే తన కుమారుడి కోసమే వివేక్ బీజేపీకి రాజీనామా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రాహుల్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. “తెలంగాణ సాధనలో నేను సిట్టింగ్ ఎంపీగా అప్పట్లో కొట్లాడాను. రాష్ట్రం రావడానికి కాంగ్రెస్ ఎంపీగా నా వంతు ప్రయత్నం చేశాను. నేను కోరుకున్న లక్ష్యం నెరవేరింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆమె దృష్టికి తీసుకెళ్ళాను. తెలంగాణ బాగుపడుతుందని అందరూ అనుకున్నారు. తొమ్మిదేళ్ళలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది. ప్రజలను నిర్లక్ష్యం చేశారు. ప్రజలు చాలా అసృంతృప్తితో ఉన్నారు. కేసీఆర్‌ను గద్దె దించే అవసరం కోసమే పార్టీలో చేరాను. టికెట్ వస్తుందా?.. రాదా? .. అనేది ముఖ్యం కాదు. పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాను అని అన్నారు.

వివేక్ చేరికతో కాంగ్రెస్ బలోపేతం అవుతుందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్. వివేక్ తండ్రి వెంకటస్వామి కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పాటు పనిచేశారని, వినోద్ ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారని, తాజాగా వివేక్ కూడా చేరారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో వెంకటస్వామి కుటుంబంలోని మూడు తరాలకు అనుబంధం ఉన్నదన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడం కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమని నమ్మినందున ఇప్పుడు చేరారని, ఆయనకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు.

కేంద్ర మాజీమంత్రి జి.వెంకటస్వామి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లో వచ్చిన వివేక.. 2009లో పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. 2014లో కాంగ్రెస్‌ తరపున పోటీచేసి ఓడిపోయాక బీఆర్‌ఎస్‌లో చేరి ప్రభుత్వ సలహాదారుగా పని చేశారు. కొంతకాలం పాటు ఆయన బీఆర్ఎస్ లో కొనసాగారు. బీఆర్ఎస్ ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ లోని కొందరు నేతలు బీజేపీలో చేరారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను గద్దె దించే సత్తా బీజేపీకి ఉందని ఆ నేతలు అప్పట్లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు కాషాయ పార్టీలో చేరారు.



Updated : 1 Nov 2023 7:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top