Home > తెలంగాణ > Telangana Elections 2023 > J. P. Nadda : తెలంగాణకు 9ఏళ్లలో కేంద్రం ఎంతిచ్చిందంటే..? : నడ్డా

J. P. Nadda : తెలంగాణకు 9ఏళ్లలో కేంద్రం ఎంతిచ్చిందంటే..? : నడ్డా

J. P. Nadda : తెలంగాణకు 9ఏళ్లలో కేంద్రం ఎంతిచ్చిందంటే..? : నడ్డా
X

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కుటుంబపాలన అంతంకావడం ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ పాలన రజాకార్లను తలపిస్తోందని విమర్శించారు. ఘట్‌కేసర్‌లో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయకత్వానికి నడ్డా దిశానిర్దేశం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం 9ఏళ్లలో 9లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు. కేంద్ర పథకాలు, రాష్ట్రానికి ఇచ్చిన నిధులను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.





రెండు రోజుల్లో 20వేల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టారని.. మరి సీఎం కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని నడ్డా ప్రశ్నించారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ను గద్దె దించాల్సిన అవసరముందన్నారు. కేవలం తమ ఆకాంక్షల కోసమే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించాయని.. క్రమంగా ఈ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోయాయని నడ్డా ఆరోపించారు. కేసీఆర్‌కు ఒక సందేశం ఇస్తున్నా.. వచ్చే ఎన్నికల్లో అన్నీ ముగిసిపోతాయి’’ అని నడ్డా వ్యాఖ్యానించారు.





టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది యువత జీవితాలతో కేసీఆర్ చెలగాటం అడారని నడ్డా విమర్శించారు. రజాకార్లతో చేతులు కలపడానికి కేసీఆర్ సిగ్గు ఉండాలని ఫైర్ అయ్యారు.ఇటీవల గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డును మోదీ ప్రకటించారని గుర్తు చేశారు. ఈనెలలో తెలంగాణాలో 30కి పైగా సభలు నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది. ఈ నెల 10న, 27న రెండు సార్లు అమిత్ షా తెలంగాణకు రానున్నారు. రాజేంద్రనగర్, ఆదిలాబాద్ బహిరంగసభల్లో ఆయన పాల్గొంటారు. 20, 21 తేదీల్లో రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ రాష్ట్రంలో పర్యటిస్తారు.


Updated : 6 Oct 2023 11:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top