Home > తెలంగాణ > Telangana Elections 2023 > BJP MLA Candidates List: బీజేపీ పంపిన తొలి జాబితా.. 38 మందిలో ఎవరెవరు ఉన్నారంటే?

BJP MLA Candidates List: బీజేపీ పంపిన తొలి జాబితా.. 38 మందిలో ఎవరెవరు ఉన్నారంటే?

BJP MLA Candidates List: బీజేపీ పంపిన తొలి జాబితా.. 38 మందిలో ఎవరెవరు ఉన్నారంటే?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించే పనిలో పడ్డాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్ర నాయకత్వం ఏకాభిప్రాయం కుదిరిన 38 మంది జాబితాను ఇప్పటికే అధిష్టానానికి పంపించింది. దీన్ని పరిశీలించిన అధిష్టానం అక్టోబర్ 15 లేదా 16న తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. తొలి జాబితాలో మొత్తం 38 మంది పేర్లు ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మూడు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. అయితే బీజేపీ ప్రకటించే 38 మంది అభ్యర్థుల జాబితాలో వీరి పేర్లు ఉన్నాయని విస్తృత ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై పార్టీ మాత్రం ఎలాంటి అధికారిక చేయలేదు.

* అంబర్‌పేట - కిషన్ రెడ్డి

* హుజురాబాద్ - ఈటల రాజేందర్

* కరీంనగర్ - బండి సంజయ్

* దుబ్బాక - రఘునందన్ రావు

* గద్వాల - డీకే అరుణ

* మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

* బోథ్‌ - సోయం బాపూరావు

* ఆర్మూర్ - ధర్మపురి అర్వింద్‌

* ఇబ్రహీంపట్నం - బూర నర్సయ్య గౌడ్

* ముషీరాబాద్ - బండారు విజయలక్ష్మి

* సనత్‌నగర్‌ - మర్రి శశిధర్ రెడ్డి

* ఉప్పల్ - ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్

* మల్కాజిగిరి - రాంచందర్‌రావు

* ఖైరతాబాద్ - చింతల రామచంద్రారెడ్డి

* గోషామహల్ - విక్రమ్‌ గౌడ్

* మహేశ్వరం - అందెల శ్రీరాములు యాదవ్

* కల్వకుర్తి - తల్లోజు ఆచారి

* మహబూబ్‌నగర్‌ - జితేందర్ రెడ్డి

* తాండూరు - కొండా విశ్వేశ్వర్ రెడ్డి

* కుత్బుల్లాపూర్‌ - కూన శ్రీశైలం గౌడ్

* భువనగిరి - గూడూరు నారాయణ రెడ్డి

* ఆలేరు - కాసం వెంకటేశ్వర్లు

* చొప్పదండి - బొడిగే శోభ

* వరంగల్ తూర్పు - ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు

* భూపాలపల్లి - చందుపట్ల కీర్తిరెడ్డి

* వేములవాడ - చెన్నమనేని వికాస్‌ రావు

* ఆదిలాబాద్‌ - పాయల్‌ శంకర్‌

* సూర్యాపేట - సంకినేని వెంకటేశ్వర్లు

* పరకాల - గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి

* వర్ధన్నపేట - కొండేటి శ్రీధర్

* మహబూబాబాద్ - హుస్సేన్ నాయక్

* సికింద్రాబాద్ - బండ కార్తీక రెడ్డి

* నర్సంపేట - రేవూరి ప్రకాశ్ రెడ్డి

* నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి

* వరంగల్‌ పశ్చిమ - ఏనుగుల రాకేశ్‌ రెడ్డి

* స్టేషన్‌ ఘన్‌పూర్‌ - విజయరామారావు

* రాజేంద్రనగర్‌ - తోకల శ్రీనివాస్‌ రెడ్డి




Updated : 8 Oct 2023 8:58 PM IST
Tags:    
Next Story
Share it
Top