Home > తెలంగాణ > Telangana Elections 2023 > Revanth Reddy : బీఆర్ఎస్ వంద తప్పులు పూర్తయ్యాయి.. కాంగ్రెస్ విజయం ఖాయం.. - రేవంత్ రెడ్డి

Revanth Reddy : బీఆర్ఎస్ వంద తప్పులు పూర్తయ్యాయి.. కాంగ్రెస్ విజయం ఖాయం.. - రేవంత్ రెడ్డి

Revanth Reddy : బీఆర్ఎస్ వంద తప్పులు పూర్తయ్యాయి.. కాంగ్రెస్ విజయం ఖాయం.. - రేవంత్ రెడ్డి
X

పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం చేసిందేమీ లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేబినెట్లో నలుగురు మహిళలకు స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో మాట్లాడారు.ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

బీఆర్ఎస్ హయాంలో బిల్లులు రావడం లేదని సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రాలో అధికారం కోల్పోతామని తెలిసినా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వంద తప్పులు పూర్తయ్యాయని, ఇక కాంగ్రెస్ విజయం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే రైతు బంధు బంద్ అవుతుందని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాము పాలనాపగ్గాలు చేపడితే రైతులతో పాటు కౌలు రైతులకు సైతం రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు.

ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి రూ.₹12వేలు ఇస్తామని రేవంత్ స్పష్టం చేశారు. 2004లో రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ అని గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌తో పాటు భూమి ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామని రేవంత్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే స్టేషన్ ఘన్పూర్ కు వంద పడకల హాస్పిటల్తో పాటు డిగ్రీ కాలేజీ తీసుకొస్తామని హామీ ఇచ్చారు.




Updated : 14 Nov 2023 10:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top