KTR Assembly Speech : ముంబై..బొగ్గుబాయ్..దుబాయ్ అన్నట్లు కాంగ్రెస్ పాలన : కేటీఆర్
X
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందని విమర్శించారు. పదేళ్లలో తెలంగాణ ప్రాంతం విధ్వంసానికి గురైందంటూ గవర్నర్ ప్రసంగంలో చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. గవర్నర్ ప్రసంగంలో సత్యదూరమైన మాటలు కనిపించాయన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల పక్షమేనని చెప్పారు.
ముంబై, బొగ్గుబాయ్, దుబాయ్ అన్నట్లు కాంగ్రెస్ పాలన ఉండేదని కేటీఆర్ విమర్శించారు. గత కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు, ఆకలి కేకలు ఉండేవని కేటీఆర్ అన్నారు. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క రూపాయి ఇవ్వనంటే కాంగ్రెస్ నాయకులు ఎందుకు పెదవి విప్పలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యులు ఇందిరమ్మ పాలన గురించి మాట్లాడినప్పుడు వారి హయాంలో జరిగిన అరాచకాలపై తాము మాట్లాడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రులు పొన్నం, భట్టి ఫైర్ అయ్యారు. గత పదేళ్ల పాలన గురించి మాట్లాడమంటే.. ఉమ్మడి పాలన గురించి మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు.