Home > తెలంగాణ > Telangana Elections 2023 > KCR : బీఆర్ఎస్లో కొత్త టెన్షన్.. అర్బన్ ఓటర్ల తీరుతో గుబులు

KCR : బీఆర్ఎస్లో కొత్త టెన్షన్.. అర్బన్ ఓటర్ల తీరుతో గుబులు

KCR : బీఆర్ఎస్లో కొత్త టెన్షన్.. అర్బన్ ఓటర్ల తీరుతో గుబులు
X

బీఆర్ఎస్ అధిష్టానానికి అర్బన్ టెన్షన్ పట్టుకుంది. అర్బన్ ప్రాంతాల్లోని ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని సర్వేల్లో తేలింది. గతంతో పోల్చితే అర్బన్ ప్రాంత ప్రజలు ఆ పార్టీకి దూరం అవుతున్న వాళ్లే ఎక్కువ. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నవాళ్లలో దాదాపు అర్బన్ ప్రాంత కార్యకర్తలే అధికం. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాల్లో గెలుపొందగా.. 3 స్థానాల్లో ఓడిపోయింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీకి ఘోరంగా దెబ్బపడింది. నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. సిట్టింగ్ స్థానమైన భువనగిరిని కోల్పోవడం బీఆర్ఎస్ కు గట్టిదెబ్బ తగిలింది.

తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ లోనూ బీఆర్ఎస్ బలం సరిపోక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలవల్ల గట్టెక్కాల్సి వచ్చింది. కొన్నికొన్ని స్థానాల్లో ఓటమి అంచుల వరకు వెళ్లింది. ఉమ్మడి జిల్లాల్లో 18 మున్సిపాలిటీలు ఉండగా.. నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి, దేవరకొండ, కోదాడ, సూర్యపేటలో లక్షకుపైగా ఓటర్లు ఉన్నారు. తాజాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలస వచ్చిన నేతల్లో ఎక్కువ ఉన్నది ఈ ప్రాంతం నుంచే. ఏకంగా కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ లే పార్టీలు మారుతున్నారు. దీంతో పట్టణ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. చిన్న మున్సిపాలిటీల్లోనూ అదే తీరు కనిపిస్తుంది.

లీడర్లే కాకుండా ఓటర్లు కూడా అధికార పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో విమర్శిస్తున్నారు. చిట్యాల, మోత్కూర్ ల్లో అభివృద్ధి ఆమడ దూరంలో ఉంది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ స్వయంగా పరిస్థితిని చక్కబెట్టాలని చూసినా ఫలితం లేకపోయింది. అయితే బీఆర్ఎస్ మాత్రం ప్రచారాల్లో అభివృద్ధి మంత్రాన్ని జపిస్తోంది. తీసుకొచ్చిన పథకాలు, నెరవేర్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే నిన్ని వరకు తమవెంట ఉన్న లీడర్లు పార్టీ మారడంతో ఆందోళన మొదలయింది. అయితే ప్రచారంలో ప్రజల తీరు మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.




Updated : 10 Nov 2023 3:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top