Home > తెలంగాణ > Telangana Elections 2023 > TS Assembly Elections 2023 : మళ్లీ తెరపైకి తెలంగాణ సెంటిమెంట్.. ఎంతవరకు వర్కౌంట్ అవుతుంది?

TS Assembly Elections 2023 : మళ్లీ తెరపైకి తెలంగాణ సెంటిమెంట్.. ఎంతవరకు వర్కౌంట్ అవుతుంది?

TS Assembly Elections 2023 : మళ్లీ తెరపైకి తెలంగాణ సెంటిమెంట్.. ఎంతవరకు వర్కౌంట్ అవుతుంది?
X

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులను విమర్శించేందుకు బీఆర్ఎస్ పార్టీ మళ్లీ స్వరాష్ట్ర సెంటిమెంట్ ను వాడుకుంటుంది. ఆంధ్రా లీడర్లు, ఢిల్లీ గులాములు, తెలంగాణ ద్రోహులు అంటూ విమర్శిస్తుంది. ఢిల్లీ పార్టీలకు ఎందుకు ఓటు వెయ్యాలని కేసీఆర్.. ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు నడుమ యుద్ధం అంటున్న కేటీఆర్.. తెలంగాణ ద్రోహులంతా మిలాఖత్ అయ్యారని హరీశ్ రావు.. ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో రెచ్చిపోతున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ద్రోహుల పాలు చేయొద్దంటూ ప్రజలకు సూచిస్తున్నారు. అమరుల త్యాగాలు, కేసీఆర్ పోరాటం గుర్తుకు తెచ్చుకుని ఓటెయ్యాలని చెప్తున్నారు. మొన్నటి వరకు సంక్షేమం, అభివృద్ధిపై జరిగిన బీఆర్ఎస్ క్యాంపెయిన్.. ఒక్కసారిగా దిశ మార్చుకుంది. ఢిల్లీ గులాములకు, తెలంగాణ ద్రోహులకు ఓటేద్దామా? మళ్లీ మోసపోదామా? అంటూ సెంటిమెంట్ పాలిటిక్స్ ను తెరపైకి తీసుకొచ్చింది బీఆర్ఎస్.





స్పీచుల్లో పదును తగ్గిందని సర్వేల్లో తేలడంతో.. గేరు మార్చిన కారు, సెంటిమెంట్ పాలిటిక్స్ ను మొదలుపెట్టింది. 2014, 2018 ఎలక్షన్స్ మాదిరిగానే సెంటిమెంట్ తో ప్రజల్లోకి వెళ్తే వర్కౌంట్ అవుతుందని అనుకుంటుంది. అందులో భాగంగా రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేకంగా పాటలు తీసుకొస్తుంది. కొత్తగా ట్రెండ్ క్రియేట్ చేసి.. సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్లు, సెలబ్రెటీలతో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై వీడియోలు చేయిస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో వార్ నడిపిస్తుంది. ప్రతిపక్షాలపై పోస్టర్లు, మీమ్స్, నాడు నేడు అంటూ రీల్స్ చేయిస్తూ.. కొత్త ప్రయత్నాలు చేస్తుంది. ప్రత్యేకంగా కుల సంఘాలతో కార్యక్రమాలు నిర్వహించి వారి సంక్షేమానికి భరోసాలు, హామీలు ప్రకటిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రతిపక్షాలన్నీ గులాబి బాస్ కు, బీఆర్ఎస్ నేతలకు ఇప్పుడు తెలంగాణ పదం ఎత్తే అర్హత లేదని విమర్శిస్తున్నాయి. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రంన్ని సర్వ నాశనం చేశారని, ఏ రంగంలో సరైన అభివృద్ధి జరగలేదని ఆరోపిస్తున్నారు. భూ కబ్జాలు, స్కాంలు, వాటాలతో దోచుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు. బీఆర్ఎస్ మాయమాటలను మళ్లీ నమ్మెందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని చెప్తున్నారు. సెంటిమెంట్ వ్యూహాలకు కాలం చెల్లిందంటూ మండిపడుతున్నాయి. రాష్ట్రానికి ద్రోహం చేశారని, చేసిన అభివృద్ధి ఎక్కడో చూపాలని ఆరోపింస్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రచారంలో కొత్తగా ఏం చేసినా.. దానికి అపోజిట్ గా కొత్త వ్యూహాలు రచించి వారి ప్లాన్ ను తిప్పికొడుతున్నాయి. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. ప్రజలు ఆగం అవుతారని హెచ్చరిస్తున్నాయి. ఇన్ని పరిణామాల మధ్య బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయం వర్కౌంట్ అవుతుందా? ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ పార్టీకి ఓటేస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.




Updated : 8 Nov 2023 8:50 AM IST
Tags:    
Next Story
Share it
Top