Home > తెలంగాణ > Telangana Elections 2023 > Telangana assembly elections 2023: గూగుల్ యాడ్స్లో గులాబి బాసే నెంబర్ 1

Telangana assembly elections 2023: గూగుల్ యాడ్స్లో గులాబి బాసే నెంబర్ 1

Telangana assembly elections 2023: గూగుల్ యాడ్స్లో గులాబి బాసే నెంబర్ 1
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ తగ్గేదే అంటోంది. ప్రచారం, సభలకు ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే పార్టీపై స్పెషల్ గా పాటలు రాయించుకుని, సెలబ్రెటీలతో ప్రమోట్ చేయించుకుంటున్నాయి. కాగా అడ్వటైజ్ రూపంలో వచ్చే ఏ అవకాశాన్ని పార్టీలు వదులుకోవడం లేదు. యూట్యూబ్ లో, వెబ్ సైట్స్ లో యాడ్స్ పై కూడా ఎక్కువగా దృష్టి పెట్టారు. ఏ వీడియో చూసినా.. ఏ వెబ్ సైట్ ఓపెన్ చేసినా ఎన్నికల యాడ్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా ఆన్ లైన్ యాడ్స్ లో కూడా బీఆర్ఎస్, సీఎం కేసీఆరే టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఇది ఈసీకి పెద్ద చిక్కులా మారింది. ఆన్ లైన్ యాడ్స్ కూడా ఎన్నికల ప్రచారం కిందికే వస్తాయి. అయితే వీటి లెక్కలు, యాడ్స్ కు పెట్టిన ఖర్చులను తేల్చడంలో ఈసీకి చిక్కొచ్చి పడింది. అయితే ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో వేసే యాడ్స్ పై ఈసీ దగ్గర పూర్తి లెక్కలు ఉన్నాయి. ఏ పార్టీ ఎంత ఖర్చు చేసింది, ఎన్ని యాడ్స్ ఇచ్చింది అనే పూర్తి సమాచారాన్ని సేకరిస్తుంది. దీంతో పార్టీ అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకుని వ్యవహరిస్తున్నారు. అయితే టెక్నాలజీని గట్టిడా వాడుకుంటూ విచ్చల విడిగా ఆన్ లైన్ యాడ్స్ ఇస్తున్నారు.

యాడ్స్ లో టాప్ లో ఉన్న బీఆర్ఎస్.. పార్టీ చేసిన అభివృద్ధి, తెచ్చిన హామీల పోస్టర్లు వేయించి ప్రచారం చేస్తుంది. ప్రతిపక్షాలను వ్యతిరేకిస్తూ వీడియోలు చేయించి వీడియో యాడ్స్ రూపంలో ప్రచారం చేస్తుంది. ప్రచార ఖర్చు లెక్కలోకి రాకుండా సోషల్​ మీడియా, డిజిటల్​ మీడియాను రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎక్కువగా వాడుకుంటున్నారు. దీంతో ఎన్నికల ఖర్చు లెక్కలోకి రాకుండా పోయింది. పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ఫేస్​బుక్ లో​ 1.1 మిలియన్లు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్​రెడ్డికి 1.5 మిలియన్లు, సీఎం కేసీఆర్​ కు 8.7 లక్షలు, బీజేపీ ఎంపీ బండి సంజయ్​కు 3 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అలాగే ఒక్కో ఎమ్మెల్యేకు వారి వారి నియోజవర్గాల్లో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. దీంతో పార్టీలన్నీ ఫేస్​బుక్​, ఇన్​స్టాలోనే ప్రచారం చేసుకుంటున్నారు. గూగుల్, యూట్యూబ్ యాడ్స్ రూపంలో ప్రజలకు చేరువవుతూనే ఉన్నారు. వీటన్నింటినీ ఈసీ పరిశీలించడం కాస్త కష్టమే. అయితే యాడ్స్ వేసే వారంతా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సర్టిఫికెట్ తెచ్చుకున్నారా లేదా అన్నది పరిశీలించాల్సి ఉంది.

Updated : 11 Nov 2023 3:57 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top