Home > తెలంగాణ > Telangana Elections 2023 > TS Assembly Elections 2023 : కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా.. మంత్రి కేటీఆర్

TS Assembly Elections 2023 : కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా.. మంత్రి కేటీఆర్

TS Assembly Elections 2023 : కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా.. మంత్రి కేటీఆర్
X

రైతులకు పెట్టుబడి సాయంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government)అమలు చేస్తున్న 'రైతుబంధు' సాయాన్ని ఆపాలంటూ ఈసీకి కాంగ్రెస్ లేఖ రాయడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Minister KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు పథకానికి పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‎కు తెలంగాణ (Telangana) ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని అన్నారు. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయిందని వ్యాఖ్యలు చేశారు. రైతుబంధును (Rythu Bandhu) ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ (Congress) తోకలు కట్ చేయడం పక్కా అని స్పష్టం చేశారు.

ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఇంటింటికి మంచినీళ్లు ... ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటరేమో? అందులో కూడా కేసీఆరే కనిపిస్తడు కదా? కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయింది. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరు. అన్నదాతల పొట్టకొట్టే కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరు. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా. ఇప్పటికే నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నరు. తెలంగాణ రైతులకు కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.




Updated : 26 Oct 2023 6:00 AM GMT
Tags:    
Next Story
Share it
Top