Home > తెలంగాణ > Telangana Elections 2023 > TS Assembly Elections 2023 : బీఎస్పీ మేనిఫెస్టో రిలీజ్.. కీలక హామీలతో..

TS Assembly Elections 2023 : బీఎస్పీ మేనిఫెస్టో రిలీజ్.. కీలక హామీలతో..

TS Assembly Elections 2023 : బీఎస్పీ మేనిఫెస్టో రిలీజ్.. కీలక హామీలతో..
X

తెలంగాణలో ఎన్నికల సందడి నెలకొంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు ఉండడంతో పార్టీలు గేర్ మార్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు మేనిఫెస్టోను కూడా ప్రకటించింది. అటు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ప్రకటించడంతోపాటు ఆరు గ్యారెంటీల స్కీమ్ను తెరమీదకు తెచ్చింది. ఇదే క్రమంలో బహుజన్ సమాజ్ వాది పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇప్పటికే 20మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన బీఎస్పీ.. బహుజన భరోసా పేరుతో పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో పలు కీలక హామీలను ప్రకటించింది.





విద్య, ఉద్యోగం, ఉపాధి అంశాలకు బీఎస్పీ తన మేనిఫెస్టోలో పెద్దపీట వేసింది. నూరేళ్ళ ఆరోగ్య ధీమా, కాన్షీ యువ సర్కార్, పూలే విద్యా దీవెన, బహుజన రైతు ధీమా, చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి వంటి కీలక హామీలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. యువతకు ఐదేళ్లలో 10లక్షల ఉద్యోగాలు, మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్, ప్రతి కుటుంబానికి 15లక్షల ఆరోగ్య బీమా, ఇంటి నిర్మాణానికి 6లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.

1. కాన్షీ యువ సర్కార్:

యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు (మహిళలకు 5 లక్షల కొలువులు).

2. పూలే విద్యా దీవెన:

మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్

ప్రతి మండలం నుంచి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య.

డేటా, ఏఐ కోడింగ్లో శిక్షణ

3. బహుజన రైతు ధీమా:

ధరణి పోర్టల్ రద్దు

ప్రతి పంటకు కనీస మద్దతు..

రైతులకు విత్తు నుండి విక్రయం వరకు ఖచ్చితమైన ప్రభుత్వ రాయితీ.

4. చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి:

మహిళా కార్మికులు, రైతులకు ఉచిత వాషింగ్ మెషిన్, స్మార్ట్ ఫోన్, డ్రైవింగ్లో శిక్షణ

అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల ఉద్యోగ క్రమబద్దీకరణ.

మహిళా సంఘాలకు ఏటా రూ. 1 లక్ష

5. భీం రక్షా కేంద్రాలు:

వృద్ధులకు హాస్టల్, ఆహారం, ఉచిత వైద్య సేవలు.

రక్షా కేంద్రాల్లో వికలాంగులు, ఒంటరి మహిళలకు తోడ్పాటు.

6. బ్లూ జాబ్ కార్డ్‌:

పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీ

రోజూ కూలీ రూ. 350 కి పెంపు

కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్య, జీవిత భీమా

7. నూరేళ్ళ ఆరోగ్య ధీమా:

ప్రతి కుటుంబానికి రూ. 15 లక్షల ఆరోగ్య భీమా ప్యాకేజీ.

ఏటా రూ. 25,000 కోట్లతో పౌష్టికాహార, ఆహార బడ్జెట్

8. వలస కార్మికుల సంక్షేమ నిధి:

5,000 కోట్ల నిధితో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు

వలస కార్మికులకు వసతి

గిగ్ కార్మికులు, లారీ, టాక్సీ డ్రైవర్లకు సబ్సిడీ క్యాంటీన్లు

9. షేక్ బందగీ గృహ భరోసా:

ఇల్లు లేని వారికి 550 చ.గ. ఇంటి స్థలం

ఇల్లు కట్టుకునే వారికి రూ. 6 లక్షలు సాయం

ఇంటి పునర్నిర్మాణానికి రూ.1 లక్ష సాయం

10. దొడ్డి కొమురయ్య భూమి హక్కు :

భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి.. మహిళల పేరిట పట్టా.


Updated : 17 Oct 2023 10:21 AM GMT
Tags:    
Next Story
Share it
Top