TS Assembly Elections 2023 : బీఎస్పీ మేనిఫెస్టో విడుదల.. బీఆర్ఎస్, కాంగ్రెస్ లను మించి..!
X
తెలంగాణ ఎన్నికల్లో ప్రజలను ఆకర్శించేందుకు వినూత్న రీతిలో పథకాలను ప్రవేశ పెడుతున్నాయి పార్టీలు. అదే బాటలో బీఎస్పీ (బహుజన్ సమాజ్వాదీ పార్టీ) నడిచింది. ఇవాళ బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళా కార్మికులకు, రైతులకు, విద్యార్థులకు మేనిఫెస్టోలో పెద్దపీట వేశారు. అంగన్వాడీ, ఆశా వర్కర్ల రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. మహిళా సంఘాలకు ఏటా రూ.లక్ష అందజేస్తామని పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య భూమి హక్కు స్కీమ్ ద్వారా భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి ఇస్తామని చెప్పకొచ్చారు.
మేనిఫెస్టో ముఖ్యాంశాలు:
• కాన్షీ యువ సర్కార్: యువతకు ఐదేళ్లల్లో 10 లక్షల ఉద్యోగాలు (అందులో మహిళలకు 5 లక్షల కొలువులు).
షాడో మంత్రులుగా విద్యార్థి నాయకులు.
• పూలే విద్యా దీవెన: మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్. ప్రతి మండలం నుంచి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య. డేటా, ఏఐ, కోడింగ్ లో శిక్షణ
• బహుజన రైతు ధీమా: ప్రతి పంటకు కనీస మద్దతు ధరతో కొనుగోలు. రైతులకు విత్తు నుండి విక్రయం వరకు ఖచ్చితమైన ప్రభుత్వ రాయితీ. ధరణి పోర్టల్ రద్దు
• చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి: మహిళా కార్మికులు, రైతులకు ఉచిత వాషింగ్ మెషిన్, స్మార్ట్ ఫోన్, డ్రైవింగ్ శిక్షణ. అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల ఉద్యోగులు క్రమబద్దీకరణ. మహిళా సంఘాలకు ఏటా రూ. 1 లక్ష
• భీం రక్షా కేంద్రాలు: వృద్ధులకు హాస్టల్, ఆహారం, ఉచిత వైద్య సేవలు. రక్షా కేంద్రాల్లో వికలాంగులకు, ఒంటరి మహిళలకు తోడ్పాటు.
• బ్లూ జాబ్ కార్డ్: పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీ.
రోజూ కూలీ రూ. 350 కి పెంపు. కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్య, జీవిత భీమా
• నూరేళ్ళ ఆరోగ్య ధీమా: ప్రతి కుటుంబానికి రూ. 15 లక్షల ఆరోగ్య భీమా ప్యాకేజీ. ఏటా రూ. 25,000 కోట్లతో పౌష్టికాహార, ఆహార బడ్జె
• వలస కార్మికుల సంక్షేమ నిధి: 5,000 కోట్ల నిధితో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు వలస కార్మికులకు వసతి
గిగ్ కార్మికులు, లారీ, టాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు
• షేక్ బందగీ గృహ భరోసా కింద.. ఇల్లు లేని వారికి 550 చ.గ. ఇంటి స్థలంతో పాటు.. ఇల్లు కట్టుకునేందుకు రూ. 6 లక్షల సాయం, ఇంటి పునర్నిర్మాణానికి రూ.1 లక్ష సాయం.
• దొడ్డి కొమురయ్య భూమి హక్కు కింద.. భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి, మహిళల పేరిట పట్టా.