Home > తెలంగాణ > Telangana Elections 2023 > Satyavathi Rathod : హారతిచ్చిన మహిళలు.. సత్యవతి రాథోడ్పై కేసు..

Satyavathi Rathod : హారతిచ్చిన మహిళలు.. సత్యవతి రాథోడ్పై కేసు..

Satyavathi Rathod : హారతిచ్చిన మహిళలు.. సత్యవతి రాథోడ్పై కేసు..
X

మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న కారణంతో పోలీసులు ఆమెపై కేసు ఫైల్ చేశారు. ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ ఎఫ్‌ఎస్‌టీ టీమ్‌ చేసిన ఫిర్యాదు మేరకు 171-ఈ,171-హెచ్ ఐపీసీ ఆర్/డబ్ల్యూ 188 ఐఓసీ సెక్షన్ల కింద గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్‌ తరఫున ప్రచారం కోసం ఇటీవల సత్యవతి కొంగరగిద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ఆమెకు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఈ క్రమంలో సత్యవతి రాథోడ్‌ హారతి పళ్లెంలో రూ.4వేలు వేశారు. దీంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకే డబ్బులిచ్చారని ఎఫ్‌ఎస్‌టీ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎన్నికల అధికారులు విచారణ జరిపి మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు బుక్ చేశారు.




Updated : 17 Nov 2023 12:56 PM IST
Tags:    
Next Story
Share it
Top