Home > తెలంగాణ > Telangana Elections 2023 > TS Assembly Elections 2023 : టీ కాంగ్రెస్కు షాక్.. కీలక నేత రాజీనామా..

TS Assembly Elections 2023 : టీ కాంగ్రెస్కు షాక్.. కీలక నేత రాజీనామా..

TS Assembly Elections 2023 : టీ కాంగ్రెస్కు షాక్.. కీలక నేత రాజీనామా..
X

కాంగ్రెస్ పార్టీకి చెరుకు సుధాకర్ షాకిచ్చారు. కాంగ్రెస్లో సామాజిక న్యాయం లేదంటూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అటు బీఆర్ఎస్ సైతం ఆయన్ను పార్టీలోకి చేర్చుకునేలా ప్రయత్నాలు సాగిస్తోంది. నకిరేకల్ టికెట్ ఆశించిన సుధాకర్కు నిరాశే ఎదురైంది. కాంగ్రెస్ ఆ టికెట్ను ఇటీవల పార్టీలో చేరిన వేముల వీరేశంకు కేటాయించింది. అప్పటినుంచి చెరుకు సుధాకర్ అసంతృప్తితో ఉన్నారు.

కాంగ్రెస్ లో బీసీ వర్గాలకు తగిన అవకాశాలు లేవని.. టికెట్ల కేటాయింపులో అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఉందంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో ఆరోపించారు. అంతేకాకుండా తన రాజీనామాకు ఎంపీ కోమటిరెడ్డి తీరు కూడా కారణమని అందులో పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా తన అడ్డా అన్నట్లుగా కోమటిరెడ్డి ఒంటెద్దు పోకడలు బాధ కలిగించాయన్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా నకిరేకల్ టికెట్ను వేముల వీరేశంకు కేటాయించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇప్పటికైన కాంగ్రెస్ బాధ్యతాయతంగా ప్రవర్తించాలని చెరుకు సుధాకర్ సూచించారు.


Updated : 20 Oct 2023 10:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top