Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కేసీఆర్..!
X
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 నిమిషాలకు గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ పెద్దలు సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలను రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి స్వయంగా ఆహ్వానించారు. మరికొందరి ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు, కోదండరాంలను ఆహ్వానించారు. సీనియర్ నేతలు చిదంబరం, అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, మీరాకుమార్, కుంతియా, భూపేష్ బఘేల్, అశోక్ చవాన్, సుశీల్‌కుమార్ షిండే, మాణికం ఠాగూర్, కురియన్‌లను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. వీరితో పాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం పంపారు. అంతేకాకుండా పలువురు సినీ ప్రముఖులకు కాంగ్రెస్ ఆహ్వానాలు పంపింది.