Home > తెలంగాణ > Telangana Elections 2023 > CM KCR : కాంగ్రెస్‌ గెలిస్తే ధరణి బంగాళాఖాతానికే..: కేసీఆర్‌

CM KCR : కాంగ్రెస్‌ గెలిస్తే ధరణి బంగాళాఖాతానికే..: కేసీఆర్‌

CM KCR : కాంగ్రెస్‌ గెలిస్తే ధరణి బంగాళాఖాతానికే..: కేసీఆర్‌
X

ఎన్నికల్లో ప్రజలు గెలవాలి.. ప్రజలు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. బోధన్‌లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ.. రాయి ఏదో రత్నమేదో గుర్తించి ప్రజలు ఓటేయ్యాలన్నారు. విచక్షణతో ఓటు వేసి సరైన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలన్నారు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలని, ప్రజలు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ కృషి చేస్తోందన్నారు. సమైక్య రాష్ట్రంలో నిజాంసాగర్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎండబెట్టిందని.. ఏడాది మొత్తం నిజాంసాగర్‌ను నిండుగా ఉంచే బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. వ్యవసాయ స్థిరీకరణ జరగాలని బీఆర్ఎస్ శ్రమించిందని , వ్యవస్థాయ స్థిరీకరణ కోసం సాగునీటి పన్ను రద్దు చేశామన్నారు.

యావత్ తెలంగాణ మొత్తం చెరువులు , డ్యాంలు కట్టామన్నారు కేసీఆర్. వ్యవసాయం నిలబడాలని బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. అవసరమైన వాళ్లకు పెన్షన్ ఇస్తూనే రైతులను ఆదుకుందన్నారు. రైతులు ఇబ్బంది పడకూడదనే నిజాంసాగర్ నీళ్ల తీరువా రద్దు చేశామని, 24 గంటలు కరెంట్ ఫ్రీ గా ఇస్తున్నామన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదని అన్నారు. రైతుల కోసమే పెట్టుబడి సాయం కింద రైతు బంధు పథకాన్ని పెట్టామన్నారు. రైతు బీమా కింద రూ. 5లక్షలు ఇస్తున్నామని, దురదృష్టవశాత్తూ రైతు మరణిస్తే.. వారంలోపే ఆ పరిహారాన్ని అందజేస్తున్నామన్నారు. వరి ధాన్యం అమ్మినప్పుడు మీ గ్రామాల్లోనే కనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సమయానికి మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తున్నామని చెప్పారు.

కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో రైతు బంధు ఉందా అని ప్రశ్నించారు కేసీఆర్. పక్కరాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో రైతు బంధు లేదన్నారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శిస్తున్నారు. రైతుబంధు దుబారానా అని అడిగారు. మహారాష్ట్ర వాళ్లు వచ్చి అక్కడ బీఆర్ఎస్ పార్టీ పెట్టమని అడుగుతున్నారని చెప్పారు సీఎం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ వస్తే ధరణీ తీసి బంగాళాఖాతంలో వేస్తం అంటున్నడని, ధరణీ తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం, బ్రోకర్ల రాజ్యమే వస్తుందన్నారు. ధరణీ వల్లే మీకు రైతుబంధు వస్తోందని రైతులనుద్దేశించి అన్నారు కేసీఆర్ . అందుకే ఆలోచించి ఓటు వెయ్యాలన్నారు.

షకీల్ బాయ్ గెలిస్తే ధరణీ ఉంటదని , ఈ ఒక్కమాట మీదనే మీరు ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ వేయెద్దని అన్నారు. తెలంగాణకు శత్రువు కాంగ్రెస్సేనని అన్నారు. కరెంట్ 24 గంటలు ఉండాలంటే షకీల్ బాయ్ గెలవాలని, సుదర్శన్ రెడ్డి గెలిస్తే 3 గంటలే కరెంట్ అని అన్నారు. ఉన్న నిజాం సాగర్ ను కాంగ్రెస్ ముంచితే.. బీఆర్ఎస్ పూర్వ వైభవం తెచ్చిందన్నారు. బీడీ కార్మికులకు ఏ సీఎం అయినా , పీఎం అయినా పెన్షన్లు ఇవ్వాలని ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. వారికి పెన్షన్ల ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.




Updated : 15 Nov 2023 2:30 PM IST
Tags:    
Next Story
Share it
Top